ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మేమొంటోలు,ప్రశంస పత్రాలను అందించిన రెడ్ క్రాస్ సెక్రెటరీ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 22(జనంసాక్షి):
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహకారంతో జూనియర్ రెడ్ క్రాస్ అధ్వర్యంలో అజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థులకు గత వారం రోజులుగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, సాంగ్స్, స్పీచ్ పెయింటింగ్, రంగోలి కాంపిటీషన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నేడు మేమొంటోలు, మరియు సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది.
ఈ సదర్భంగా జిల్లా సెక్రెటరీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో సామజిక చైతన్యము తేవాలనే ఉద్దేశంతో భారత స్వాతంత్ర్య వజ్రోస్తవ వేడుకలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రదానోపాద్యాయుడు కుర్మయ్యా మాట్లాడుతూ… రెడ్ క్రాస్ సొసైటి వారు జూనియర్ రెడ్ క్రాస్ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన కార్యక్రమాలు పిల్లలో స్వాతంత్య్రం పై అవగహన పెంచడంతో పాటు సమాజిక చైతన్యము కలిగించేలా నిర్వహించడం అభిందనీయమ న్నారు.ఈ కార్యక్రమాలో జూనియర్/యుత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ డి. కుమార్, రెడ్ క్రాస్ పాఠశాల కన్వీనర్లు సురేష్ బాబు, శ్రీలత, మేనేజింగ్ కమిటి సభ్యులు కృష్ణ రావు, పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.