ప్రాజెక్ట్ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య.

share on facebook

ములుగు బ్యూరో,సెప్టెంబర్22(జనం సాక్షి):-
గురువారం గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్ నగర్ బాలికల గిరిజన ఆశ్రమ  పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగ సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు.బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల పరిసరలను వంట గది,స్టోర్ రూమ్ కార్యాలయ గది, క్లాస్ రూములు పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార అందిస్తున్నారా,సాయంత్రం వేళల్లో స్టడీ అవర్ నిర్వహిస్తున్నారా,స్టడీ అవర్ లో విధులను నిర్వహించే ఉద్యోగులు స్టాప్ సక్రమంగా పాఠశాలకు వస్తున్నారని వార్డెన్ ని అడిగి తెలుసుకున్నారు.పాఠశాల ఆవరణంలో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పాఠశాల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాప్ ములుగు వెలుగు యాప్ లో హాజరు నమోదు చేసుకోవాలని సమయానికి హాజరు కాని వారిని గైర్వహాజర్ గా పరిగణించి మేమె జారీ చేయాలని కలెక్టర్   సూచించారు.

Other News

Comments are closed.