ఫాల్గన్ ఆయుధకార్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
– ఇద్దరు అధికారులతోపాటు 17 మంది మృతి
– ప్రధాన మంత్రి దిగ్భ్రాంతి
పల్గాన్ ఆయుధాగారంలో భారీ అగ్నిప్రమాదం
ఇద్దరు అధికారులు సహా 17మంది మృతి
ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి
ముంబై,మే31(జనంసాక్షి):మహారాష్ట్ర పల్గాన్‌లోని ఆయుధాగారం పరిశ్రమలో గడిచిన రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మృతిచెందారు. మృతుల్లో లెఫ్ట్‌నెంట్ కల్నల్, మేజర్‌తో పాటు 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీకి చెందిన జవాన్లు ఉన్నట్లు సమాచారం. మరో 19 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఆయుధాగార పరిసర గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయుధాగార పరిశ్రమలో పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. పల్గాన్‌లోని ఆయుధగారం పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయుధగారంలో భారీ పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రంతా ఆయుధగారంలో భారీగా మంటలు ఎగిసిపడుతూనే ఉండడంతో భారీగా ఆయుధాలు దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, 15మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఘటనాస్థలిని పరిశీలించనున్నారు. అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు అధికారులు సహా 20 మంది సైనికులు మృతి చెందారని కూడా అంటున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఫైర్ ఇంజన్‌లను అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. దేశంలోనే అతి పెద్దదైన కేంద్ర సైనిక ఆయుధ కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా సైనికులకు అవసరమైన ఆయుధాలను ఈ కర్మాగారం నుంచి సరఫరా చేస్తుంటారు. కాలం తీరిన బాంబులను సైతం ఇక్కడే డిస్పోస్ చేస్తుంటారు. ఈ ఘటనలో కర్మాగారం మొత్తం అగ్నికి ఆహుతైంది. డిపోలోని ఓ షెడ్డుకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీ పేలుళ్ల శబ్దాలకు స్థానిక ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు వెయ్యి మంది ప్రజలను సైనికులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా మృతుల సంఖ్య అధికంగా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఆర్మీ డిపోలో పేలుడు జరగడం దురదృష్టకరమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ అన్నారు. మృతుల కుంటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర పడ్నవీస్ మంగళవారం విూడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం జరగడం దురదృష్టమని, ఈ ఘటనలో కొంతమంది చనిపోయారని, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని, సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, పరిస్థితి అదుపులో ఉందని ఆయన అన్నారు. ఎలాంటి సహాయానికైనా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు అర్థరాత్రిపూట ఒక్కసారిగా పేలుడు జరగడంతో తామంతా భయపడ్డామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ సోమవారం రాత్రి 1-30 గంటలకు పేలుడు శబ్దం వినిపించిందని, చాలా భయం వేసిందని చెప్పారు. మా ఇల్లు ఒక్కసారిగా కదిలినట్టయి, ఇంటిపై రాళ్లు పడినట్లు అనిపించిందని, వెంటనే బయటకు వచ్చి చూశానని, ఆర్మీ డిపోలో భారీగా మంటలు కనిపించాయని, ఏం జరిగిందో అర్థం కాలేదని చెప్పారు. మంగళవారం తెల్లవారు జాము 4 గంటలకు అక్కడకు వెళ్లి చూశానని, అంబులెన్స్‌లో చాలామందిని తీసుకువెళుతున్నారని ఆయన తెలిపారు. పుల్గావ్‌లోని కేంద్ర ఆర్మీ ఆయుధ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.