బాన్సువాడ వేంకటేశ్వర మందిరంలో
ధ్వజస్థంభం, శిఖర, ప్రతిష్ఠాపనా మహూత్సవం
కామారెడ్డి,ఆగస్ట్11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణలోని వేంకటేశ్వర మందిరంలో ధ్వజస్థంభం, శిఖరం ప్రతిష్ఠాపనా మహూత్సవం కార్యక్రమంలో భాగంగా యజ్ఞాది క్రతువులను నిర్వహించారు. ఆలయ
అధ్యక్షుడు అల్లి కష్ణ దంపతులతో చిన్న జీయర్‌స్వామి శిష్యులు వేదపండితుల ఆధ్వర్యంలో యజ్ఞం, ప్రతిష్ఠ ఉత్సవ విగ్రహాల జలాధివాసం కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం ధ్వజ శిఖర స్థాపన, యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు ప్రశాంత్ శర్మ తెలిపారు. ఈ మూడు రోజులు ప్రత్యేక పూజలతోపాటు అన్నదానం నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ఈ బహత్ కార్యక్రమాలకు పట్టణంలోని మహిళలు, భక్తులు, పురప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కపాకటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నర్సింగ్‌రావు, దిగంబర్‌రావు, నాగులగామ గోపి, శివకుమార్, భాస్కర్, పాండు, భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.