బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

కరీంనగర్‌, జూన్‌ 12 (జనంసాక్షి):

అంతర్జాతీయ బాల కార్మిక విమోచన దినోత్సం సందర్భంగా మంగళవారం జిల్లా బాలల హక్కుల న్యాయవేదిక, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రభుత్వేర సంస్థల సమన్వయ సమావేశం న్యాయసేవా సదన్‌లో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి వి. జయసూర్య , నాలుగవ అదనపు జిల్లా జడ్జి ప్రసాద్‌రాజు, జిల్లా అదనపు ఎస్పీ బి. జనార్దన్‌్‌రెడ్డి,  బాల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ జయశ్రీ, డీసీసీఓ పర్వీన్‌, డీపీఓ లక్ష్మీరాజం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లించవలసిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర బాలల న్యాయవేదిక కో ఆర్డినేటర్‌ కృష్ణప్రసాద్‌ బాలల న్యాయచట్టం-2000 అమలు పై సమన్వయ పాత్రను చర్చించారు.లీగల్‌ సర్వీ సెస్‌ అథారిటీ సెక్రటరీ సీనియర్‌ సివిల్‌ జడ్జి బాల భాస్కర్‌రావు  మాట్లాడుతూ బాలల న్యాయవ్యవస్థ పకడ్బందీగా అమలుకై సంధానంగా పనిచేయా ల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  సమావేశ సంధా నకర్తగా బాలల హక్కుల ఉపాధ్యాయ వేదిక జిల్లా కన్వీనర్‌ డి. రవీందర్‌ వ్యవహరించారు. ఈ కార్య క్రమంలో  ప్రత్యేక బాలల పోలీసు విభాగాధిపతి సంజీవరావు, బాలల హక్కుల న్యాయవేదిక జిల్లా అధ్యక్షుడు కె. వెంకటయ్య, ఉపాధ్యక్షురాలు, డి. వాణి, ప్రధాన కార్యదర్శి రవి, బాలల హక్కుల ఉపాధ్యాయవేదిక ఉప కన్వీనర్‌ రాజ్‌మహ్మద్‌, జెజె డెస్క్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ బాలరాజు తదిత రులు పాల్గొన్నారు.