బీజేపీధి దొంగ బిక్షాటన
చిత్తశుద్ది ఉంటే కేంద్రం మొక్కు పిండి నిధులు తేవాలి
వరి ధాన్యం కొనుగోలు చేయాలి
ఎంపీపీ కల్లూరి హరికృష్ణ
శివ్వంపేట సెప్టెంబర్ 27 జనంసాక్షి :
భారతీయ జనతా పార్టీ నాయకులు దొంగ బిక్షాటన చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించాలని, స్వార్థ రాజకీయ కోసమే శివ్వంపేట మండలంలో బీజేపీ పార్టీ నాయకులు బిక్షాటన పేరుతో పబ్బం గడిపే కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీపీల ఫోరం జిల్లా అద్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ది చేసిన ఘనత సీఎం కేసిఆర్ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామాలలో ఉనికిని కాపాడుకోవడం కోసమే బీజేపీ నాయకులు పాకులాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వమే అన్ని చేస్తుందని ప్రగాల్బాలు పలికే బీజేపి నాయకులకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముక్కు పిండి రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి ఒక రోడ్డు బాగుచేస్తేనన్న ప్రజలు హర్షించేవారన్నారు. ఇదే బిక్షాటన యాత్రను ఢిల్లీ దాకా కొనసాగిస్తే బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుండనే ఏమోనని ఆయన అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా అనంతారం చౌరస్తా నుండి శివ్వంపేట మండలంలోని పోతులబోగూ డ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సహకారంతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి రూ. 33 కోట్లు నిధులు మంజూరు చేయించిన విషయం బీజేపీ నాయకులకు తెలవదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పార్టీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని అస్థిరతపరచి, రైతంగం నడ్డి విరిచే చర్యలకు పాల్పడుతుందని, వ్యవసాయం కార్పొరేట్ గద్దెలకు అప్పగించడానికి కుతంత్రం పన్నుతుందని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని, అలాగే ఉపాధి హామీ ఉత్త పథకంగా మార్చివేసి ప్రజలకు ఏమి ఉపయోగం లేకుండా ఈ పథకాన్ని నిరుపయోగం చేసిన ఘనత మోడీ సర్కార్ దే నన్నారు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రులకు సిగ్గు, శరం ఉంటే రైతులు పండించిన వరి ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు, రైతులు తిరగబడి బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగకుండా బహిష్కరణ చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆయన హెచ్చరించారు.