బీజేపీ మతవాద పార్టీ: కేసీఆర్‌

కరీంనగర్‌: బీజేపీతో టీఆర్‌ఎస్‌కు విభేదాలు ఉన్న మాట వాస్తమేనని కేసీఆర్‌ చెప్పారు. బీజేపీ ఒక మతవాద పార్టీ అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ముస్లింలను రజాకార్లతో పోల్చిందని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలియజేశారు. బీజేపీ కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టే అని పేర్కొన్నారు.