భారీ వర్షాలకు బోయిన్‌పల్లి మండలంలో నీటమునిగిన పత్తిపంట

కరీంనగర్‌: బోయిన్‌పల్లి మండలంలోని దుండ్రుపల్లి, కోరెం, తడగొండ, బోయిన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పత్తిపంట నీటమునిగింది. దుండ్రపల్లి కోరెం వెళ్లె రహదారిలో కొండపోచమ్మ వరద ఎద్ధృతికి రహదారి కోతకు గరైంది. తడగొండ గ్రామంలో నీట మునిగిన పత్తిపంటను తహసీల్ధారు పరిశీలించారు.