భావనపాడు నిందితులకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం, జూలై 31 : జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌లో ఇటీవల రెండు రోజుల క్రితం ఒక ప్రేమ జంటపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితులు కొమర రవి, అడ్ల దుర్వాసులకు కోటబొమ్మాళి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ప్రియుడిని చెట్టుకు కట్టేసి, యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మేరకు రవి, దుర్వాసులను అరెస్టు చేసి కోర్టులో హజరచగా ఈ మేరకు విమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారిని నరసన్నపేట సబ్‌జైలుకు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 10 వేలు రికవరీ:- సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌లో విహరిస్తున్న ప్రేమ జంట నుంచి అడ్ల దుర్వాసులు, కొమర వరి తీసుకున్న పది వేల రూపాయలను రికవరీ చేసినట్లు నౌపడ ఎస్సై సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు.