వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణమ్మ

 

 

 

 

 

 

ఊర్కొండ జనవరి 24, ( జనం సాక్షి) ;ఊరుకొండ మండల కేంద్రంలోని మాదారం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ శుక్రవారం రోజు సాయంత్రం ప్రారంభించారు. ఎంపీ డీకే అరుణమ్మ నిధులు 2.50 లక్షల రూపాయలతో 1000 లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్ ను బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించినారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నేతలు సాహితీ రెడ్డి, పద్మజా రెడ్డి, ముచ్చర్ల లక్ష్మారెడ్డి,రాజేందర్ గౌడ్, ఆంజనేయులు, మండల నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.