మార్బుల్ స్టోన్స్ మీద పడటంతో ఇద్దరు మృతి

జనవరి 24, ( జనం సాక్షి) ;మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాలీ నుంచి మార్బుల్ స్టోన్స్ దించుతుండగా మీద పడటంతో ఇద్దరు మరణించారు.
వివరాల్లోకి వెళ్తే.. గార్ల మండలం బంగ్లా తండాలో ఇందిరమ్మ ఇల్ల నిర్మాణం కోసం మార్బుల్ స్టోన్స్‌ను బంగ్లా తండాకు తీసుకొచ్చిన ఈ ప్రమాదం జరిగింది. మృతులను బంగ్లా తండాకు చెందిన బోడ తరుణ్ (25), ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురికి చెందిన ట్రాలీ డ్రైవర్ గుగులోతు అవినాశ్(25)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



