భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య
ములుగు బ్యూరో,సెప్టెంబర్23(జనం సాక్షి):-
భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమంను, క్యాచ్ ద రైన్,వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్ పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యులు సంజయ్ కుమార్ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ లైవ్లీ హుడ్ అర్బన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ ఎఫైర్స్ పేర్కొన్నారు.శుక్రవారం ములుగు కలెక్టరేట్ సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ములుగు,జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ అదిత్య,భవేష్ మిశ్రా,ఐటిడిఎ పిఓ అంకిత్,రవి టెక్నికల్ ఆఫీసర్ సెంట్రల్ వాటర్ కమిషన్, బారిక్ జి పిఎంఓ కన్సల్టెంట్,రెండు జిల్లాల అధికారు లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ లావణ్య,భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర్,డిఆర్ఓ కే.రమాదేవి,సీఈవోలు, డిఆర్డిఓలు,డిపిఓలు,డిఏవో లు, ఎపిడివోలు,ఎంపిడివో లు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.