మంగళ వారి పేట ఓబిసి సెల్ అధ్యక్షుడిగారాగం మల్లేష్
ఖానాపురం సెప్టెంబర్ 1జనం సాక్షి
మండలంలోని మంగళ వారి పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ గ్రామ కమిటీని గురువారం ఎన్నుకున్నట్లు మండల ఓ బి సి సెల్ అధ్యక్షులు వల్లే శ్రీనివాస్ తెలిపారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారిపేట ఓబీసీసీల్ గ్రామ అధ్యక్షులు గా రాగం మల్లేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం వరంగల్ ఓబీసీసీల్ చైర్మన్ ఓర్సు తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్ మెహన్రెడ్డి,ఖానాపూర్ మండలం అధ్యక్షులు వేములపెల్లి వెంకటప్రసాద్,ఎంపీటీసీ ఫుల్ సింగ్, గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మ గాని నవీన్,మండలం ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు మేకల లింగయ్య,సింగు శ్రీను,ఎద్దు వీరయ్య,వెంకన్న, రవి,సురేష్,కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు.