గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నిమ్మల తిరుపతి గౌడ్ నియామకం..

గంభీరావుపేట జూలై 02(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా బుధవారం రోజున టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుగా నిమ్మాల తిరుపతి గౌడ్ నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు తన నియమాకానికి సహకరించిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర వాక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు, కటకం మృత్యుంజయం ,జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాంధీబాబు లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అలాగే రానున్న రోజులలో మండల అభివృద్ధి కోసం కార్యకర్తల కోసం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తనకు మండల కాంగ్రెస్ నాయకులు సహకరించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు అందర్నీ కలుపుకొని నడుస్తానని అన్నారు



