అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 04 : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జనం సాక్షి వెంగల్ పాడ్, తిర్మన్ పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపనలు చేశారు. రాంపూర్ తండా నుండి వెంగల్ పాడ్ తండా వరకు రూ.5.48 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీ.టీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కే.కే తండా నుండి మెగ్యానాయక్ తండా వరకు రూ. 2.94 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం తిర్మన్ పల్లిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పన కోసం నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగ రావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

తాజావార్తలు