సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు – అన్నసత్రం నిర్వహణ

సిరికొండ, జూలై 04 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నసత్రం ఏర్పాటు చేశారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాడ్కోల్ గ్రామ సర్పంచ్ లత శంకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, భూషణ్ రెడ్డి, నందమయ్యతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, సకాలంలో వర్షాలు కురిసి రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.

తాజావార్తలు