ఖమ్మంలో ఘనంగా సయ్యద్ బాషా జన్మదిన వేడుకలు

* ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
ఖమ్మం, జూలై 4, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర దూదేకుల/నూర్బాష్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ షేక్ సయ్యద్ బాషా జన్మదిన వేడుకలు శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సంఘం నాయకులు పండ్లను పంపిణీ చేశారు.అనంతరం నగరంలోని హోటల్ సితారలో జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సయ్యద్ బాషా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దూదేకుల, నూర్బాష్ వర్గాల హక్కుల సాధన కోసం ‘తెలంగాణ జేఏసీ (JAC)’ ఏర్పాటుకు తగిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి రావాల్సిన కుల దామాషా వాటాను సాధించుకునేందుకు సంఘం శ్రేణులన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ లాల్ జాన్ పాషా, ప్రధాన కార్యదర్శి షేక్ రహీమ్, మహిళా అధ్యక్షురాలు షేక్ జానీ బేగం, ఉపాధ్యక్షురాలు షేక్ సఖినాబి, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ లాలూ సాహెబ్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ రహీమ్ పాషా, నాయకులు షేక్ సిద్దు పాషా, షేక్ రసూల్, షేక్ సైదా హుస్సేన్, షేక్ ఖాసిం, సీనియర్ నాయకులు షేక్ సైదులు, వల్లబి జానీ, రామన్న పేట షేక్ సైదులు, షేక్ సాహెబ్ హుస్సేన్, సుజాతనగర్ ఖాసిం, పోలిశెట్టి గూడెం సైదులు తదితరులు పాల్గొన్నారు.



