రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు సీఎం చిత్రపడాన్ని పాలాభిషేకం


జనంసాక్షి తరిగొప్పుల న్యూస్ 04 జనగామ నియోజకవర్గ పరిధిలోని రైతుల పక్షాన రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు గాను తేలంగాణ రాష్ట్ర టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో, జనగామ కేంద్రంలోని కొమ్మూరి ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి తరిగొప్పుల మండల అధ్యక్షులు వగలబోయిన యాదగిరి ను కాంగ్రెస్ పార్టీ జనగామ ఇన్చార్జి ప్రతాపరెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగినది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుదలో భాగంగా మంజూరు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల గురించి, మండల కేంద్రానికి మంజూరైనటువంటి ఇండ్ల గురించి మాట్లాడుతూ తరిగొప్పుల మండల కేంద్రం ఎక్కువగా SC, ST, బడుగు బలహీన వర్గా ప్రజల అధికంగా ఉంటున్న మండలం వలన మంజూరైనటువంటి ఇండ్లు సరిపోవునందున, మండల కేంద్రానికి మరికొన్ని ఇండ్లు మంజూరు చేయవలసిందని కోరడం జరిగినది, ఈ విషయమై కొమ్మూరి ప్రతాప రెడ్డి గారు స్పందించి తరిగొప్పుల మండల కేంద్రానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో తరిగొప్పుల మండల అధ్యక్షులు , వగలబోయిన యాదగిరి గౌడ్ మరియు తరిగొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు పండుగ కనుకయ్య, తరిగొప్పుల మండల మాజీ ప్రధాన కార్యదర్శి పింగిలి ఇంద్రారెడ్డి, తరిగొప్పుల మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎడ్ల నవీన్ కుమార్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



