మంత్రి గంగులకు మరోమారు కరోనా

share on facebook

హోం క్వారంటైన్‌లో ఉన్న మంత్రి
కరీంనగర్‌,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ): మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. సర్ది, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. గత కొన్నిరోజులుగా ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా, మంత్రి గంగుల కరోనా బారినపడటం ఇది రెండోసారి. గతకొంతకాలంగా ఆయన హుజూరాబాద్‌కే పరిమితం అయ్యి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Other News

Comments are closed.