మతోన్మాదంపై పోరాడమే భగత్ సింగ్ ఇచ్చే నిజమైన నివాళి

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 28(జనం సాక్షి )

 

మతోన్మాదంపై పోరాటం చేయడమే భగత్ సింగ్ కు ఇచ్చే నిజమైన నివాళి అని, భగత్ సింగ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని, భగత్ సింగ్ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ( డివైఎఫ్ఐ ) డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు.
స్థానిక భగత్ నగర్ లోని భగత్ సింగ్ 115వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి పూలమాలలు వేసి అలంకరించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భగత్ సింగ్ నేను నాస్తికుని ఎలా అయ్యాను అనే పుస్తకంలో మతోన్మాదం పై తన వైఖరిని స్పష్టంగా చెప్పారని, నాడు బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్లు యువతను దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, భగత్ సింగ్ కు నిజమైన నివాళి ఇవ్వడం అంటే మతోన్మాదంపై పోరాటం చేయడమేనని, నేటి యువత భగత్ సింగ్ వారసత్వాన్ని పొనికి పుచ్చుకొని పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భగత్ సింగ్ విగ్రహాన్ని పార్లమెంట్లో నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని వారు కోరారు. భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నగర ప్రధాన కార్యదర్శి జి రవీందర్ నాయక్ డివైఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి రాజు నాయకులు రవి కిషన్ అనిల్ సునీల్ శ్రీకాంత్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.