మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ
హుజూరాబాద్ నియోజకవర్గానికి మొత్తం రూ. 20 కోట్లు
16 గ్రామాల్లో సమైక్య భవనాల నిర్మాణం
పక్కపార్టీల కుంకుమ భరిణలకు మోసపోవద్దు: హరీష్ రావు
హుజూరాబాద్,అగస్టు12(జనం సాక్షి): హుజూరాబాద్ నియోజకవర్గంలోని 19 గ్రామాలకు మహిళలకు, పట్టణ పరిధిలోని 30 వార్డుల మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాల అన్ని కలిపి హుజూరాబాద్ నియోజకవర్గానికి మొత్తం రూ. 20 కోట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్టాల్ల్రో ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద రుణాల పంపణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని.. మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర మహిళలు వడ్డీ లేని రుణాలను పొందుతున్నారని అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు ప్రస్తుతం వడ్డీ లేని రుణాలు వచ్చాయని, ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంత సంఘాలకు కూడా ఇదే విధంగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్ పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.1.90 కోట్లు అందిస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు భవనాలు ఉన్నాయని, కరీంనగర్ జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు అన్ని గ్రామాల్లో సమైక్య భవనాలు ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. కానీ హుజూరాబాద్‌లో చూస్తే ఒక్క భవనం కూడా లేదని అన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పట్టించుకోక పోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. ఇపుడు ఈ బాధ్యతను మేము తీసుకుంటున్నా మని, హుజూరాబాద్ పట్టణంలో 20 గుంటల స్థలంలో రూ. కోటి వెచ్చించి పట్టణ సమైక్య భవనాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. దీనికి ఈ రోజు భూమి పూజ కూడా చేశామని అన్నారు. హుజూరాబాద్ మండలంలోని 16 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షల చొప్పున రూ. 3.10 కోట్లు మంజూరు చేశామని, మంచి స్థలాలు ఎంపిక చేసిన వెంటనే పనులు ప్రారంభించుకుని మహిళా సంఘాల భవనాలు
నిర్మించుకుందామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక మహిళలు చెట్ల కింద సమావేశాలు పెట్టుకోవల్సిన అవసరం ఉండదని మంత్రి అన్నారు. అభయ హస్తం పెన్షన్ల గురించి కొందరు మహిళలు అడుగు తున్నారని, ఈ పథకం కింద 60 ఏండ్లు దాటిన మహిళలకు రూ. వెయ్యి పింఛన్ వస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్లు నెలకు రూ. 1,016 వస్తోందని, ఇపుడు 57 ఏండ్లు ఉన్నవారికి ఆసరా పింఛన్లు అందించే కార్యక్రమం ప్రారంభం అవుతున్నదని, అందుకే అభయ హస్తం పథకంతో మహిళలకు లాభం లేదని ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని, ఎల్‌ఐసీ వద్ద ఉన్న డబ్బులు త్వరలో వడ్డీతో సహా సంబంధిత మహిళలు అందించి ఆసరా కింద కొత్త పింఛన్లు ఇప్పిస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పక్క పార్టీలు ఆశ చూపే కుంకుమ భరణి, గడియారాలకు జనం ఆగం కావొద్దు.. అవి తిండి పెట్టవు అని మంత్రి హరీశ్‌రావు సూచించారు. గడియారాలు, కుంకుమ భరణిలకు మోసపోవద్దు. అందులో మర్మమేందో గ్రహించాలి. చిన్నచిన్న వాటికి ఆశపడకండి. ఎండమావుల వెనుక పరుగెత్తితే మనకు ఏం రాదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే రావు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. పని చేయించుకునే హక్కు విూది.. చేసే బాధ్యత మాది. విూ ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. మేం విూ సేవకులం. దేవుడిచ్చిన శక్తితో విూకిచ్చిన హావిూలను నెరవేరుస్తాం. టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. చెప్పుడు మాటలకు, మొసలి కన్నీళ్లకు మోసపోవద్దు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. దీవించండి. న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించండి అని మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.