మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి భూపతి-సానియా జోడీ

ప్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి భారత జోడీ మహేష్‌ భూపతి, సానియా మీర్జా జోడీ దూసుకెళ్ళింది. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భూపతి-సానియా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్‌ క్వెటా పెష్కె (చెక్‌ రిపబ్లిక్‌), మైకో బ్రయాన్‌ (అమెరికా) జోడీని 6-2, 6-3 పాయింట్ల తేడాతో వరుస సెట్లలో చిత్తుగ ఓడించింది. అంతకుముందు భూపతి, సానియా జోడీ రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన వర్జినీ రజ్జానో, నికోలస్‌ డెవిల్డర్‌ జోడీని 7-6, 6-3 తేడాతో మట్టికరింపించింది. రష్యాకు చెందిన ఎలీనా వెస్నీనాతో కలిసి ఐదో సీడ్‌గా మిక్స్‌డ్‌ డబ్బుల్స్‌లో బరిలోకి దిగిన భారత ఆటగాడు లియాండర్‌ పేస్‌ టోర్నిల్‌ క్వార్టర్స్‌కు చేరాడు. ప్రాన్స్‌కు చెందిన మార్క్‌ గిక్వెల్‌, మతిల్డె జోహాన్సన్‌ జోడీపై 6-2, 6-0 పాయింట్ల తేడాతో పేస్‌ జోడీ గెలుపొందింది.