మునుగోడులో కాషాయ విజయ ఢంకా తథ్యం : పోకల
గరిడేపల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి): మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా తథ్యమని భాజపా జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని పొనుగోడు గ్రామంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ అసమర్థ ప్రభుత్వానికి సవాల్ విసురుతూ కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించేందుకు భాజపా అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో నిలిచారన్నారు . మునుగోడు గడ్డమీద ప్రధాని నరేంద్రమోడీ అభినవ సర్దార్ అమిత్ షా సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ సత్తా చూపేందుకు ఉవ్విళ్లూరుతుందన్నారు. మునుగోడు ఈ దెబ్బతో టీఆర్ఎస్ వలసవాదుల ప్రభుత్వం కకావికలు కాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింగ్ అంజయ్య, నాయకులు బాణోతు చిరంజీవి , కారింగుల రామయ్య , నర్సింగ్ నాగసైదులు , వినయ్ , పోలంపల్లి రామయ్య, ముత్తినేని వెంకన్న , నర్సింగ్ వెంకన్న , పాలెల్లి ముత్తయ్య , మండవ అప్పయ్య , గండ్ర వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area