ముమ్మరంగా జాతర పనులు

భద్రాధ్రి కొత్తగూడెం, ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): అశ్వారావుపేట మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు మహాజాతర జరుగుతుంది. జాతరకు రోజూ వేలాదిమంది తరలివస్తారు. జాతర నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా చలువపందిళ్లు వేశారు.
ఆలయం నుంచి గ్రామంలోకి విద్యుత్తు అలంకరణ చేస్తున్నారు. ఐదు రోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. జాతరకు భక్తులు వేలాదిగా తరలిరావాలని కోరారు.

తాజావార్తలు