ముస్తాబైన బతుకమ్మ…. ఆడపడుచుల సంబరాలు….

గ్రామం లో ఘనం గా బతుకమ్మ వేడుకలు ఏర్పాట్లు….గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి….
ములుగు ప్రతినిధి,సెప్టెంబర్25(జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామం లో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ 9 రోజులు బతుకమ్మ వేడుకలను ఘనం గా నిర్వహించాలని, ఆడపడుచులందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ పండుగ గా చెప్పుకునే మన బతుకమ్మను ఆడపడుచులు అందరూ కలిసి తిరొక్క రకమైన పూలతో ఏర్పాటు చేసి బతుకమ్మ ను తయారు చేయడం జరుగుతుందనీ తెలిపారు.తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా నైవేద్యాలు సమర్పిస్తారనీ తెలిపారు.దేవిని ప్రత్యేకం గా కొలవడం జరుగుతుందనీ తెలిపారు.ఆడపడుచులకు బతుకమ్మ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాం అని తెలిపారు.  తొమ్మిదో రోజు దుర్గాష్టమి పెద్ద బతుకమ్మను సాగనంపడం జరుగుతుంది.ఈ కార్యక్రమం లో గ్రామ ఆడపడుచులు మరియు గ్రామ సిబ్బంది  తదితరులు పాల్గొనడం జరిగింది.