మోదీ కెబినెట్‌ విస్తరణ

C

– 19 మంది సహాయ మంత్రులు

– ప్రకాశ్‌ జవదేకర్‌ ఒక్కడికే ప్రమోషన్‌

– ఐదుగురికి ఉద్వాసన

న్యూఢిల్లీ,జులై 5(జనంసాక్షి):ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ను మంగళవారం విస్తరించారు . పెద్దగా మార్పులకు తావు లేకుండా కొత్తగా 19మందిని కేబినేట్‌లో చేర్చుకున్నారు.. వీరందరినీ సహాయమంత్రులుగానే చేర్చుకోవడం విశేషం.  కొత్తగా 19 మంది రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఐదురుగరికి ఉద్వాసన పలికారు. పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న జవదేకర్‌కు కేబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ దక్కింది. కొత్త మంత్రులుగా రమేష్‌ చందప్ప, రమేష్‌ జినజినాగి, రాజెన్‌ గోహీన్‌, ఎస్‌.ఎస్‌. అహ్లూవాలియా, ఫగన్‌సింగ్‌ కులస్తీ, విజయ్‌ గోయల్‌, రామ్‌దాస్‌ అతవాలే, అనిల్‌ మాధవ్‌ ధవే, పురుషోత్తమ్‌ రూపాలా, ఎంజే అక్బర్‌, మహేంద్రనాథ్‌ పాండే, అర్జున్‌రాం మేఘవాల్‌, జశ్వంత్‌సింగ్‌ భాబోర్‌, అజయ్‌ టంటా, కృష్ణారాజ్‌, మన్సుఖ్‌భాయ్‌ ముంబాలియా, అనుప్రియ పటేల్‌, సీఆర్‌ చౌదరి, పీపీ చౌదరి, శుభాష్‌ రామ్‌ రావ్‌ కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొత్త మంత్రలుతో  ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ నుంచి ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. కేంద్ర మంత్రులు నిహాల్చంద్‌, రామ్‌ శంకర్‌ కటారియ, సన్వర్‌ లాల్‌, మోహన్‌ కుందారియా, మనుసుఖ్భాయ్‌ వాసవ్లను కేబినెట్‌ నుంచి తొలగించారు. కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో మోదీ భారీగా మార్పులు, చేర్పులు చేశారు. ఐదుగురు మంత్రులపై వేటు వేసిన మోదీ.. కొత్తగా 19 మంది మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు  కేబినెట్‌ ¬దా కల్పించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో  ప్రధాని మోదీ, బీజేపీ అధ్యకుడు అమిత్‌ షా, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఇక పలువురికి కేబినేట్‌ ¬దా దక్కుతుందని భావించినా  ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోని స్వతంత్ర మంత్రుల్లో ఒక్కరికే ప్రమోషన్‌ కల్పించారు. కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర ¬దా) ప్రకాష్‌ జవదేకర్‌కు మాత్రమే  కేబినెట్‌ ¬దా కల్పించారు. ప్రస్తుతం స్వతంత్ర ¬దాతో ఉన్న పీయుష్‌ గోయల్‌ (ఇంధన శాఖ), ధర్మేంద్ర ప్రధాన్‌(పెట్రోలియం), నిర్మలా సీతారామన్‌ (వాణిజ్యం, పరిశ్రమలు), ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (మైనారిటీ వ్యవహారాలు)లకు కేబినెట్‌ ¬దా దక్కుతుందని ప్రచారం జరిగినా ప్రకాష్‌ జవదేకర్‌ ఒక్కరితో సరిపెట్టారు. కేంద్రకేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో ప్రకాష్‌ కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానంగా పంజాబ్‌, యూపి ఎన్నికలను దీస్టిలో పెట్టుకుని విస్తరణ చేశారని అర్థం చేసుకోవచ్చు.  ఉత్తరాఖండ్‌లోని అల్మోరా భాజపా ఎంపీ అజయ్‌ టంటా, ఉత్తరప్రదేశ్‌లోని షాజనాపూర్‌ భాజపా ఎంపీ కృష్ణారాజ్‌, గుజరాత్‌ రాజ్యసభ సభ్యుడు మన్సుఖ్‌ భాయ్‌ మందావియా, ఉత్తర్‌ ప్రదేశ్‌ మిర్జాపూర్‌ అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియ పటేల్‌, రాజస్థాన్‌లోని నాగౌర్‌ ఎంపీ సీఆర్‌ చౌదరి, రాజస్థాన్‌లోని పాలి ఎంపీ పీపీ చౌదరి, మహరాష్ట్రలోని ధూలే భాజపా ఎంపీ శుభాష్‌ రామ్‌రావ్‌ భామ్రే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు ఆరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ, అశోక్‌గజపతిరాజు, నితిన్‌గడ్కరీ, సదానందగౌడ, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.   మోదీ సహా ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇప్పటికే ఎనిమిది మంది కేబినెట్లో ఉన్నారు. కేవలం ఉత్తరప్రదేశ్‌ నుంచే కేబినెట్‌ మంత్రుల సంఖ్యపెరిగింది! భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ కొత్తగా 19 మందికి తన కేబినెట్‌లో అవకాశం కల్పించనుండగా, సీనియర్‌ మంత్రి నజ్మా హెప్తుల్లాతోపాటు ఆరుగురు సహాయ మంత్రులను తొలగించనున్నని ప్రచారం జరిగినా ఎవరిఇనీ ముట్టుకోకపోవడం విశేషం. పార్టీ కార్యవర్గ విస్తరణను కూడా దృష్టిలో ఉంచుకొని కేబినెట్‌లో మార్పులు జరుగుతున్నాయని, తప్పించిన వారికి పార్టీలో కీలక పదవులు దక్కనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. నజ్మా హెప్తుల్లాను మంత్రి పదవి నుంచి తొలగించి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలని నిర్ణయించారని, ఆ హావిూతోనే ఆమె మెత్తపడినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కల్‌రాజ్‌ మిశ్రాను కూడా వయోభారం కారణంగా తొలగించాలని భావించినా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అటువంటి సాహసం చేయలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

యూపి నుంచి ఇద్దరు మహిళలకు చోటు

ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మరో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో ఉత్తరప్రదేశ్‌కు  చెందిన మహిళా ఎంపీలు కృష్ణరాజ్‌, అనుప్రియా పటేల్‌కు  మంత్రి పదవులు దక్కాయి. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. కృష్ణరాజ్‌ బీజేపీ ఎంపీ కాగా, అనుప్రియా పటేల్‌ ఎన్డీయే మిత్రపక్షం ఆప్నా దళ్‌ ఎంపీ కావడం విశేషం. ఆమె తన పార్టీని బిజెపిలో విలీనం చేశారు. దీంతో ఆమెకున్నరెండు ఎంపి సీట్లు బిజెపికి పెరిగాయి. ఇదిలావుంటే రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో మంగళవారం కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.  మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున ఎన్నికైన రామ్‌దాస్‌ అథవలే కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న క్రమంలో తడబడ్డారు. తన పేరు

చెప్పకుండానే ప్రమాణ పత్రం చదవడం మొదలుపెట్టారు. రామ్‌దాస్‌ పొరపాటును గుర్తించిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ .. పేరు చెప్పాలని సూచించారు. ప్రమాణం మధ్యలో కూడా రామ్‌దాస్‌ కొన్ని పదాలను అస్పష్టంగా పలికారు. పొరపాటుకు చింతించిన రామ్‌దాస్‌ తప్పును సరదిద్దుకుని మళ్లీ మొదటి నుంచి ప్రమాణపత్రం చదివారు.