మోర్తాడ్ మండలంలో నెగెటివ్ నిర్ధారణ
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 7 గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికి నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పకుండా ధరించాలని, తరచుగా శానిటైజర్ వాడాలని కోరారు.