మౌనం వీడిన తెలంగాణ మంత్రులు రోడ్‌మ్యాప్ ప్రకటించండి
ఒకే అభిప్రాయం చెప్పండి శ్రీ ఒక్కరినే పంపండి
తెలంగాణకు అనుకూలంగా సదస్సులో తీర్మానం చేయండి
తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి తేల్చాలి శ్రీ సోనియాకు లేఖ
లేదంటే పదవులకు దూరం శ్రీటీ కాంగ్రెస్ మంత్రులు
హైదరాబాద్, డిసెంబర్ 15 (జనంసాక్షి):
ఈ నెల 28న తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంత మంత్రులు హైకమాండ్‌పై ఒత్తిడి పెంచారు. తెలంగాణపై పార్టీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరఫున ఒక్కరినే పంపించాలని, ఒకే అభిప్రాయం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్షంలో తెలంగాణల పె స్పష్టత ఇవ్వకుంటే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు లేఖ రాశారు. అలాగే, ఆదివారం జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ‘లంగాణ అంశంపై చర్చించాలని కోరారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. జానారెడ్డి నేతృత్వంలో పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు బొత్సతో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని కోరారు. భేటీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కరినే పంపించాలని, రాష్ట్ర విభజనపై స్పష్టమైన నిర్ణయం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆదివారం జరిగే విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణపై చర్చించాలని, దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. ఇప్పటివరకు చాలా సంయమనంతో ఉన్నామని, ఇంకా నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి, పార్టీకి దూరం కాకతప్పదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన బొత్స.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, విూరు చెప్పినవన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హావిూ ఇచ్చారు. అలాగే, తెలంగాణపై విస్తృత స్థాయి సమావేశం తర్వాత మూడు ప్రాంతాలతో నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని బొత్స తెలిపారు. తమపై ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, ఏం చేసినా అఖిలపక్ష సమావేశంలోపు స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని టీ-మంత్రులు స్పష్టం చేశారు.