యాదాద్రి అభివృద్దితో పర్యాటకంగా పురోగతి

share on facebook

ఈ ప్రాంత అభివృద్దితో పెరగనున్న ఉపాధి

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదాద్రి భువనగిరి,నవంబర్‌11 జనం సాక్షి :  యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి పేరుతో ఏర్పాటైన  యాదాద్రి జిల్లా  భువనగిరి కేంద్రంగా మనుగడలోకి వచ్చిన తరవాత జిల్లా కార్యాలయాలన్నీ  గుట్టకు సవిూపంలో ఉన్న రాయగిరికి తరలనున్నాయి. ఇప్పటికే అక్కడ సవిూకృథ కలెక్టరేట్‌ నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. సవిూకృత కలెక్టరేట్‌కు భూమిపూజ చేశాక పనులు వేగంగా సాగుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సవిూపంలో ఉండటం ఈ జిల్లాకు సానుకూలాంశంగా మారింది. దీంతో ఇక్కడ పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్దికి అవకాశాలు ఉన్నాయి. అన్ని అవకాశాలను వినియోగించు కుంటామని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత అన్నారు. తెలంగాణలో కెసిఆర్‌ సిఎం కావడం వల్లనే అభివృద్ది శరవేగంగా సాగుతోందని అన్నారు. ప్రజలు కూడా అభివృద్ది గురించి ఆలోచన చేస్తున్నారని అందుకే టిఆర్‌ఎస్‌ వెన్నంటి నడుస్తున్నారని అన్నారు. అలాగే ఆలయ పునర్నిర్మాణంతో యాదాద్రి అద్భుత క్షేత్రంగా అవతరించనుంది. ఇప్పటికే  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వందల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక నగరిగా అలరారనుంది.  యాదాద్రి పక్కనే దాదాపు 300 ఎకరాల్లో జైనిజానికి సంబంధించిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళలాలతో పాటు హైదరాబాద్‌ ` వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌తో పారిశ్రామికంగానూ వృద్ధి చెందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గంధమల్ల చెరువును దాదాపు 10 టీఎంసీల మేర రిజర్వాయర్‌ నిర్మించడంతో భూగర్భజలాల వృద్ధితో పాటూ వ్యవసాయ రంగం పురోగమించనుంది.  అభివృద్ధిలో అన్ని జిల్లాల కంటే ముందుగా దూసుకు పోవడానికి సవిూప భవిష్యత్తులో అపార అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం భువనగిరిలో ఏకశిలపై నిర్మించిన కోట, పక్కనే ఉన్న ఆలేరు మండలంలోని కొలనుపాకలో ప్రాచీన జైన దేవాలయం, సవిూపంలోని రాజపేట మండలంలోని కోటతో కలిపి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక వలయంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో పర్యటకుల సంఖ్య పెరిగి ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి.  భువనగిరి పట్టణం హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో  ఉండటంతో ఇక్కడ 500 ఎకరాల్లో ఒకటి చొప్పున రెండు శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు ఈ నిర్మాణాలు అనువుగా ఉండనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని బీబీనగర్‌, చౌటుప్పల్‌, భువనగిరి, బొమ్మలరామారం ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడికి సవిూపంలోనే పోచంపల్లి చేనేత పరిశ్రమ దేశంలోనే పేరుగాంచింది. ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మించగా..మరో పార్క్‌ నిర్మాణానికి ఇక్కడ అవకాశముంది. సరైన మార్కెట్‌ సదుపాయాలు కలిపించి, వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తే ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించడానికి మెరికల్లాంటి చేనేత కార్మికులు సిద్ధంగా ఉన్నారు. భూతల ఓడరేవులను ఏర్పాటు చేసి వాటి ద్వారా సరకు రవాణా చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు డ్రై పోర్టులను నిర్మించాలని ప్రతిపాదించగా అందులో  ఒకటి భువనగిరి కేంద్రంగా నిర్మించాలని ప్రతిపాదిం చారు. దాదాపు 450 ఎకరాలలో నిర్మించనున్న ఈ రేవులను రైలు, రోడ్డు, విమానయాన, ఓడరేవు సదుపా యాలున్న ప్రాంతాలకు అనుసంధానించనున్నారు. ఓడరేవులో భాగంగా ఇక్కడ కంటెయినర్ల యార్డు, గోదాములు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాలు నిర్మిస్తారు. దీంతో అన్ని రంగాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయి. ఇప్పటి వరకు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న భువనగిరి భద్రత ఇక నుంచి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో ఉంటుంది. మొత్తంగా యాదాద్రి అభిశృద్దికి అవకాశాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు.

Other News

Comments are closed.