రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్
రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ పెద్దపల్లి డిసిపి రవీందర్ ఏసిపి గిరి ప్రసాద్ మరియు సీఐ లక్ష్మీనారాయణ లతో కలిసి రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. గంజాయి రైలు మార్గంల ద్వారా ఎక్కవ అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు రైల్వే స్టేషన్ లోని అనుమానిత వ్యక్తులను వారి బ్యాగులను తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసిన, సాగుచేసిన, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని డి సి పితెలపడం జరిగింది.
డీసీపీ మాట్లాడుతూ…..తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి,డిజిపి లు గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై చాలా సీరియస్ గా ఉన్నదని గంజాయి కారణంగా యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నదని, దీనివల్ల దేశ అభివృద్ధి, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు,నేర వృతికి పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
గంజాయి రహిత జిల్లాగా పెద్దపల్లి జిల్లా ను తీర్చిదిద్దడం కోసం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాన్ షాపులు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలతో పాటు గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాల కారణంగా ఎదురయ్యే అనర్ధాలు, చట్టపరంగా తీసుకునే చర్యల గురించి వారికి వివరించడం జరుగుతుందన్నారు.
ఇట్టి తనిఖీల్లో రామగుండం ఎస్ఐ శైలజ, ప్రొబేషనరీ ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.