రామలింగేశ్వరుని సేవలో భన్వర్‌లాల్
రంగారెడ్డి/ కీసర: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కుటుంబసమేతంగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని సోమవారం దర్వించుకున్నారు. శ్రావణ మాసంలో రెండోవారం స్వామిసన్నిధిలో జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి భన్వర్‌లాల్‌కు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలోని మూలవిరాట్‌కి స్వయంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం మహా మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ టి.నారాయణశర్మ, కార్యనిర్వహణాధికారి వెంకటేశ్, మాజీ చైర్మన్ టి.శ్రీనివాస్‌శర్మ, ప్రధాన అర్చకులు బలరామశర్మ, వేదపండితులు సత్యనారాయణశర్మ, దర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.