రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

ఖమ్మం: రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ త్రీవ సంక్షోభం కూరుకుపోయిందని, అధికార ప్రతిపక్షలు రెండు కుదేలైపోయాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ పేర్కున్నారు.ఖమ్మంలో అయన మీడియాతో మాట్లాడుతూ..సాంప్రదాయ పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కోట్ల రూపాయాలు ఖర్చుపెడుతున్నాయని, దీంతో వారు ప్రజలకు తేవ చేయడం లేదని, పెట్టిన ఖర్చు రాబట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు.దామాషా పద్దతి ఎన్నికలు రావాలని జేపీ సూచించారు. రాష్ట్రంలోనాయకత్వం పెరగాలని, తాను రాష్ట్ర బాద్యతల నుంచి తప్పుకుంటాన్నాని జాతీయ బాధ్యతలు చేపడుతున్నాట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలపై తమ పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అయన అన్నారు.