రాష్ట్రస్థాయిలో మెరిసిన జ్యోతిబాపూలే గురుకుల రత్నాలు
జాతీయ స్థాయికి ఎంపిక
పెద్దేముల్ ఆగస్టు 27 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ మహాత్మ
జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో క్రీడా ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 24, 25 తేదీలలో మెదక్ లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించారు. అండర్ 14 విభాగంలో షాట్ పుట్ లో సిహెచ్ గోపాల్ ద్వితీయ స్థాయి, కె.శివకుమార్ హై జంప్ లో తృతీయ స్థాయి, అండర్ 16 విభాగంలో ఎస్.అనిల్ కుమార్ షాట్ పుట్,డిస్కస్ త్రో రెండింటిలోనూ ప్రథమ స్థాయి బంగారు పతకాలు, అండర్ 16 విభాగంలో ఏ.సాయికిరణ్
షాట్ పుట్ లో ప్రథమ స్థానం, డిస్కస్ త్రో లో ద్వితీయ స్థానం సాధించడం జరిగింది.జాతీయ స్థాయికి ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం. సాయికిరణ్ షాట్ పుట్, ఎస్.అనిల్ డిస్కస్ త్రో,సిహెచ్ గోపాల్ షాట్ పుట్ లలో ఈవెంట్స్ ఎంపికయ్యారు. వచ్చే నెల సెప్టెంబర్ 10,11,12 తేదీలలో విజయవాడలో జరిగే జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం (ఐఏఎస్), సెక్రెటరీ మల్లయ్య ఒట్టు, తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ రంగారావు, ప్రెసిడెంట్ బి.ఇ స్టాన్లీ, జనరల్ సెక్రెటరీ సారంగపాణి, ద్రోణాచారి అవార్డు గ్రహీత ఇండియాథ్లెటిక్ రమేష్ కుమార్, ఉమ్మడి రంగారెడ్డి ఆర్ సి ఒ యాదయ్య గౌడ్, ప్రిన్సిపల్ కె.రమేష్, ఏటీపీ రాజీవ్, పిఈటి మహిపాల్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు