రాహుల్‌ నాయకత్వం పార్టీకి అవసరం: షబ్బీర్‌

 

కామారెడ్డి,ఆగస్ట్‌16(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని రాహుల్‌ గాంధీ ఒక్కరే ఆ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేరుస్తారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. రాహుల్‌ నాయకత్వంలో దేశంలో అధికారంలోకి వచ్చి తీరుతుందని గట్టిగా చెప్పగలమని అన్నారు. మోడీ తీరుతో ప్రజలు విసిగి వేసారారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సంక్షోభాలు కొత్తేవిూకాదని, అలాంటి సంక్షోభాల నుంచి పాఠాలు నేర్చుకుని, కొత్త ఉత్సాహంతో పుంజుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. పెగాసస్‌తో పార్లమెంటును నడిపించలేదని స్థితిలోకి బిజెపి వెళ్లిందన్నారు. రాహుల్‌ గాంధీని నాయకుడిగా ఒప్పుకోలేని వారు ఇప్పుడాయన దూకుడుతో భయపడుతున్నారని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని రాహుల్‌గాంధీ చెబుతున్నప్పుడల్లా బిజెపిలో ఎదురుదాడి చేస్తోందని అన్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు రావన్న విషయం ఇప్పుడిప్పుడే వారికి కూడా బోధపడు తోందని అన్నారు. దేశంలోని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి.. బీజేపీ మెడలు వంచాల్సిన అవసరం వుందని చెప్పడంలో రాహుల్‌ విజయం సాధించారని అన్నారు. ఈ క్రమంలో అందర్నీ కలుపుకుపోతాం.. అని రాహుల్‌గాంధీ దూసుకుని పోతున్నారని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ నిర్వహించిన దళిత దండోరాతో అటు బిజెపి, ఇటు టిఆర్‌ఎస్‌ ఉలిక్కి పడుతున్నాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యంత దారుణమైన స్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని బిజెపి ప్రచారం చేసుకుంటే సరిపోదన్నారు. ప్రజల్లో ఎంతగా ఆగ్రహం గూడుకట్టుకుందో ఇంద్రవెల్లి సభకు వచ్చిన జనాలను, వారి స్పందనను చూస్తే తెలుస్తుందని అన్నారు. రేవంత్‌ రాకతో కాంగ్రెస్‌ శ్రేణులు ఏకమవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ వైభవం తీసుకుని రాగలరని అన్నారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ బలమైన శక్తిగా మారి మరింతగా రాటుదేలుతుందని అన్నారు. ఈ భయమే టిఆర్‌ఎస్‌, బిజెపిల పుట్టి ముంచుతుందని అన్నారుకాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుంది