రేపు బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం
ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 :
మండలం పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానది తీరాన వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణము నిర్వహించడం జరుగుతుందన్నారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు