రైతులకు నష్టపరిహరం చెల్లించాలి

ఏవీ రైతు సంఘంబాగ్‌లింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం నియమించిన భూపేంద్ర సింగ్‌ హూడా కమిటీ సిపార్సుల మేరకు నీలం తుఫాను బాదిత రైతులకు నష్టపరిహరం చెల్లించాలని ఏవీ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఎకరా వరికి రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ. 20 వేలు చోప్పున నష్టపరిహరం చెల్లించాలని ఏవీ రైతు సంఘం నేతలు కోరారు. బుదవారం సుందరయ్య కళానిలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏవీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు హరిబండి ప్రసాదరావు, బోంతల చంద్రారెడ్డి, రాష్ట్ర నేత సంజీవరెడ్డి పాల్గోన్నారు.