రైలు కింద పడి వ్యక్తి మృతి

నవీపేట: నవీపేట మండలంలోని పాగేపూర్‌ గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున రైలుకిందపడి దేవయ్య(33) మృతి చెందాడు. గ్యాంగ్‌మెన్‌ గంగారం వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు. దేవయ్య పట్టాలను పరిశీలించే సమయంలో ఎదురుగా వచ్చే రైలును చూసుకోకపోవటంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.