రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

విజయవాడ, ఆగస్టు 3 : కంచికచర్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వ్యవసాయ కూలీలు ఆటోలో పనులకు వెళుతుండగా లారీ ఒకటి డీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా గాయపడ్డారు. రక్షక్‌ పోలీసులు ప్రమాదాన్ని గుర్తించి 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా వున్న ఇద్దరిని విజయవాడకు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.