రోహిత్ తండ్రి ఎన్డీ తివారియే : హైకోర్టు
న్యూఢిల్లీ, జూలై 27 : రోహిత్ శేఖర్ తండ్రి ఎన్‌డి తివారీయేనని శుక్రవారం సాయంత్రం హైకోర్టు ఎన్‌డిఎ నివేదికను బహిర్గతం చేసింది. తనను ఎన్డీ తివారి కుమారుడిగా గుర్తించాలంటూ రోహిత్ శేఖర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. సుదీర్ఘకాలం విచారణ కొనసాగడం తెలిసిందే. శుక్రవారంనాడు తుది తీర్పు వెలువడింది. తీర్పు వెలువడిన వెంటనే రోహిత్ శేఖర్, అతని తల్లి ఉజ్వలా శర్మ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అంతకుముందు పితృత్వ కేసులో డిఎన్‌ఎ పరీక్ష నివేదికను బహిర్గతం చేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ గవర్నర్ ఎన్‌డి తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.