*వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కు హాజరైన అదనపు ఎస్పీ*
*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(24):* వజ్ర సంకల్పంలో భాగంగా గోపాల్ పేట్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ హాజరయ్యారు వీరికి గోపాల్ పేట్ గ్రామ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు మరియు అదనపు ఎస్పీ గ్రామంలోని పలు సమస్యలపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు బుధవారం రాత్రి కి గోపాల్ పేట్ ఎంపీడీవో కార్యాలయంలో బస చేయనున్నారు అనంతరం గురువారం ఉదయం గ్రామంలోని పలు కాలనీలలో ఏ ఎస్ పి పర్యటించనున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ సర్పంచ్ శ్రీనివాసులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు తిరుపతయ్య యాదవ్, కో ఆప్షన్ మెంబర్ మతిన్ , ఎంపీడీవో హుస్సేనప్ప , పంచాయతీ కార్యదర్శి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు