వర్షప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల పరిశీలన

share on facebook

 

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన
నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు
మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అధిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో డ్యాం దగ్గరికి చేరుకుని ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో పై అధికారులతో సవిూక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేతలందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలపై అధికారులతో క్షేత్ర స్థాయిలో సవిూక్షిస్తున్నామని తెలిపారు. అధికారులు ఎక్కడివారక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. మత్స్యకార్మికులు చేపల వేటకు వెళ్లొద్దని మంత్రి సూచించారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దన్నారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. వర్షాల వల్ల రైతులు పంట నష్టపోయారు. ప్రభుత్వానికి నష్ట పోయిన పంట అంచనా వేసి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌ ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్‌, నగంపేట్‌ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శేఖర్‌ రెడ్డి, భూమేశ్వర్‌, జెడ్పిటిసిలు గంగాధర్‌, నర్సారెడ్డి, ఎంపిపిలు పద్మ, బురుకల సుకన్య తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.