విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తాం.

హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి సెప్టెంబర్26:-
యుఎస్ఎఫ్ఐజిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్ హనుమకొండ పట్టణ కేంద్రంలోని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నగర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సంజయ్ పాలకుర్తి హరీష్ ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శిలుగా కమిటీ సభ్యులుగా మొత్తం 17 మందితో నూతన నగర కమిటీ ఎన్నుకోవడం జరిగింది అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన హరీష్ సంజయ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేపడతామని భవిష్యత్తులో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని మరియు సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు తమపై నమ్మకంతో కమిటీని ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సాయి రాకేష్ ప్రవీణ్  ప్రశాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.