విద్యుత్ షాక్ తో యువకుల మృతి
ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 27 , (జనంసాక్షి )విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మెట్ పల్లి పట్టణంలో చోటు చేసుకున్నది.వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామానికి చెందిన కనుక వికాస్, బైండ్ల వినీత్ అనే ఇద్దరు యువకులు మెట్ పల్లి పట్టణంలోని తమ స్నేహితుని షాప్ వద్ద గల బోర్డు ను తొలగించి , కొత్తది అమర్చే క్రమంలో ,బోర్డు జారి ప్రక్కనే ఉన్న 11కేవి కి తగిలింది.దీంతో షార్ట్ సర్క్యూట్ అయి విద్యుత్ షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.