వేమూరి ఆధ్వర్యంలో ఇందిరా వృద్ధాశ్రమంలో అన్నదానం
మునగాల, సెప్టెంబర్ 23(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఇటీవల సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ ఇచ్చిన పిలుపులో భాగంగా గుజ్జర్లపూడి విజయ్ కుమార్ కోరిక మేరకు రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణవాసి చెన్నూరి రాజేష్ జ్యోతిర్మయి దంపతుల చిన్న కుమారుడు హవీష్ విజ్ఞాన్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న మానసిక వికలాంగులు అనాధలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ, గుజ్జర్లపూడి విజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఇలా తమ తమ పుట్టినరోజులు వారి పిల్లల పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు మరియు ఇతరత్రా కార్యక్రమాలు ఇలా ఆశ్రమాలలో నిర్వహించి నిరాధారణకు గురైన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.