వైద్య పరీక్షల్లో పింఛన్ దారులకు రాయితీ
ఖమ్మం, నవంబర్ 14 (ఎపిఇఎంఎస్): పింఛన్ దారులకు వైద్య పరీక్షల్లో రాయితీ కల్పించేందుకు పలు రోగ నిర్దారణ కేంద్రాల నిర్వహకులు అంగీకారం తెలిపినట్టు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. పింఛన్దారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, రవీంద్రారావు, ఖమ్మం పట్టణంలోని మెడినోవ, ఎఫెక్స్ట్, దివ్య డయోగ్నస్టిక్ సెంటర్ల యాజమానులతో సంప్రదించారు. పట్టణంలోని నెహ్రూ నగర్లో గల పింఛన్ భవన్ నుంచి గుర్తింపు కార్డులు పొందిన వారికి రాయితీపై వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ కేంద్రాల నిర్వాహకులు ముందుకు వచ్చారని వారు తెలిపారు.