శిశుమందిర్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 20 (జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.విద్యార్థులు శ్రీకృష్ణుని, గోపికలు వేషాధారణలో చేసిన నృత్యాలు కనువిందు శాయాయి. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నిర్వాహకులు, పాఠశాల ప్రధానో పాధ్యాయులు ప్రసన్న లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి పై స్థాయికి ఎదగాలని ఆశీస్సులు అందించారు.దేశభక్తిని కలిగి ఉండి దేశానికి గొప్ప పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు.ఈ వేడుకల్లో పాఠశాల అధ్యక్షులు వాస. రమేష్ బాబు మరియు వారి సతీమణి శ్రీమతి రాధా రాణి, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సహ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సభ్యులు ఆదిత్య, శివ తో పాటు పోషకులు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయుల బృందం వనజ, లలిత, సీమ, మంజుల, చంద్రకళ బిందు, సత్యవాణి, మరియు కర్మ చారులు సుజాత, స్వాతి పాల్గొన్నారు.

తాజావార్తలు