శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ….
బాన్సువాడ సెప్టెంబర్ 23 (జనంసాక్షి)
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆలయ ధర్మకర్త పరి గే ప్రేమల శంబురెడ్డి కరకములచే ఆవిష్కరించారు. సెప్టెంబర్ 26 సోమవారం నుండి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ ఐదు బుధవారం నాటితో ముగుస్తుందని తెలిపారు. శారద ఉపాసకులు శ్రీశ్రీశ్రీ మంగళగిరి చేర్యాల నరసింహమూర్తి ఆశీస్సులతో ఆలయ అర్చకులు కాశీ దత్తాత్రేయ శర్మ కాశీ సంతోష్ శర్మల ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల తో, పాటు శ్రీ శారద సేవా సమితి, భక్తమండలి, ప్రత్యేక పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైవాహంగా కొనసాగుతాయని వారు తెలిపారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి సుహాసినిలచే సామూహిక కుంకుమార్చనలు కొనసాగుతాయని తెలిపారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దశావతారాలలో దర్శనమిస్తారని తెలిపారు. పది రోజులపాటు యజ్ఞం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అమ్మవారికి అలంకరణతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగు తాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు దాండియా, బతుకమ్మ, ఆటపాటలతో పాటు సంస్కృతిక ,కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కాశి సంతోష్ శర్మతో పాటు శ్రీ శారద సేవా సమితి మహిళా విభాగం ప్రతినిధులు అర్చన ,స్వర్ణలత ,జ్యోతిర్మయి, స్వప్న, పుష్పలత, రామలక్ష్మి, కళావతి, సంగీత ,శ్రేయ, పద్మావతి ,భక్తులు అరుణ్ రెడ్డి,సంపత్ మరియు మాతా స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.