శ్రీవారిని దర్శంచుకున్న పెళ్లిసందడి బృందం


తిరుమల,అగస్టు9(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని పెళ్లి సందడి టీం దర్శించుకుంది. నటి ఎంపీ సుమలత డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, నటి, ఎంపీ సుమలత, హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, నిర్మాత రాక్‌ లైన్‌ వేంకటేష్‌, కర్ణాటక సినీ హీరో దర్శన్‌ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి స్వామివారి సేవలో పాల్గొన్నారు. కొత్త పెళ్లి సందడి సినిమా పూర్తయిన సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్లు దర్శకుడు రాఘవేంద్రరావు వెల్లడిరచారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల తర్వాత తిరుమలకు వచ్చినట్లు ఎంపీ సుమలత తెలిపారు.