శ్రీ అరబిందో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

జనగామ,సెప్టెంబర్25(జనంసాక్షి):
జనగామ జిల్లా కేంద్రంలోని గ్రేయిన్ మార్కెట్ దగ్గరలో గల శ్రీ అరబిందో ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థినులతో ఈ. ప్రభాకర్ రెడ్డి మరియు వాసుదేవ రెడ్డి  ఆధ్వర్యంలో దసరా సెలవుల నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను ఎంతో సుందరంగా తీరొక్క పువ్వులను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక కన్నుల పండుగగా అట్టహాసంగా ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు పండుగలను పాఠశాలలో నిర్వహిస్తూ తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే సంబరాల్లో విద్యార్థులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు విద్యార్థులలో సమైక్యత, పరస్పర సహకారం ,మానవిక విలువలు, వికాసాన్ని పెంచుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area