సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్ పార్టీలోకి చేరిక.
టీ ఆర్ ఎస్ లోకి చెన్నారం సర్పంచ్.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యాలాల్ మండలం చెన్నారం గ్రామ సర్పంచ్ సాయిలు టిఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకు ప్రజాధరణ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, యాలాల్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ అక్బర్ బాబా, చంద్రశేఖర్ రెడ్డి, రఘు రెడ్డి, కృష్ణ, అమర్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.